జిల్లావ్యాప్తంగా మొత్తం 109 వరకు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. అనుమతులు లేకుండా నడిపిస్తున్నవి మరో 30 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. చాలావరకు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో రెగ్యులర్ వైద్యులకు బదులు వేరే సిబ్బందితో రోజువారీ నిర్వహణ చేపడుతున్నారు. ప్రధానంగా ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో రేడియాలజిస్ట్‌లకు బదులు సాధారణ సిబ్బందితోనే సరిపెడుతున్నా సంబంధిత వైద్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతులు పొందిన వైద్యులకు బదులు అర్హత లేని, కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తుండటం గమనార్హం. వీటిపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకోకుండా సాకులు చెబుతూ తప్పించుకోవడం జిల్లాలో పరిపాటిగా మారిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ