
ౖపైపెకి బాగానే కనిపిస్తున్నా.. లోలోపల వరుసగా తాకుతున్న పోట్లు ఆ అమాత్యుడిని కలవరానికి గురిచేస్తున్నాయి. తనకు ఎదురేలేదని భావించిన ఆయనను రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు కంగుతినేలా చేస్తున్నాయి. మరో ఎనిమిది నెలల్లో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో ఆ మంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.ఎవరా మినిస్టర్..? ఎక్కడా నియోజకవర్గం..?అసలు ఏం జరుగుతోంది..? అనుకుంటున్నారా..మీరే చదవండి మరి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
రాజీనామాలను జీర్ణించుకోలేకపోతున్న మంత్రి
●
●
●
● పోయిన దగ్గరే వెతుక్కోవాలంటూఆత్మీయ సమ్మేళనాలు
● రహస్య సర్వేలతో ప్రజల నాడీ తెలుసుకునేందుకు పాట్లు
● ‘రావుల’ పేరు ప్రస్తావనపై నేతలకు క్లాస్
● అమాత్యుడి వైఖరిలో మార్పుపైబీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చ
ఆ పేరు రావొద్దు..
అసమ్మతుల రాజీనామా తర్వాత పలువురు బీఆర్‌ఎస్ నేతలు ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేరు ప్రస్తావించడంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఆయనకు మైలేజీ ఇచ్చేలా వ్యవహరించడం ఏమిటని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మనల్ని మనమే తక్కువ చేసుకునేలా ఎవరూ మాట్లాడొద్దని.. ఇంకోసారి ఆ పేరు ఎవరి నోటా రావొద్దని హెచ్చరించినట్లు వినికిడి. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపై ఆయన వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం.