
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ములుగు రూరల్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. విద్యాశాఖ కార్యకలాపాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాల్లో తరగతులను నిర్వహించకూడదని సూచించారు. మోడల్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు అర్షం రాజు, రమాదేవి, సూపరింటెండెంట్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
డీఈఓ చంద్రకళ