
వడ్డీ చెల్లిస్తే రెన్యువల్ చేయాలి
ములుగు రూరల్: జిల్లాలో పంట రుణాలు పొందిన రైతులు వడ్డీ చెల్లిస్తే రుణాలను రెన్యువల్ చేయాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పహాణీ నకల్ ఆధారంగా పొందిన పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుకు రూ. 2లక్షల మేరకు రుణమాఫీ చేయాలన్నారు. యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. ఏజెన్సీలో ఉన్న రైతులకు 30శాతం మందికి మాత్రమే పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయని పహాణీ నకల్ ఆధారంగా రుణాలు అందించాలన్నారు. అటవీహక్కు పత్రాలు పొందిన రైతులకు రైతుభరోసా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, బండి నర్సయ్య, నటరాజ్, నారాయణసింగ్, కృష్ణయ్య, సమ్మయ్య, పరంసింగ్, జనార్ధన్, రమేష్, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.
రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
అమ్జద్‌పాషా