
జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలి
వాజేడు: జీఓ నంబర్–3ను పునరుద్ధరించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలోని ఆదివాసీ యువతకు ఉపయోగపడే జీఓను 2020లో రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. గత ప్రభుత్వం ఒక్క రివ్యూ పిటిషన్ వేయకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదివాసీ సమాజం పక్షాన రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జీఓ పునరుద్ధరణ కోసం ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ప్రభుత్వంపై ఆందోళనల రూపంలో ఒత్తిడి తీసుకొచ్చేలా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. దీనిలో భాగంగా.. మే 31న భద్రాచలం ఐటీడీఏను ముట్టడిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
108లో ప్రసవం
వాజేడు: మండల పరిధి బొల్లారం గ్రామానికి చెందిన సీహెచ్.రమాదేవి 108 అంబులెన్స్‌లో శనివారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చింది. బొల్లారం గ్రామానికి చెందిన రమాదేవికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో వెంకటాపురం(కె)కు తరలించారు. మొదటి కాన్పు కావడంతో ప్రసవం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వైద్యుల సూచన మేరకు ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. ఈఎంటీ రాజ్యలక్ష్మి, పైలెట్ కుమారస్వామి 108 ఆంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా.. ఏటూరునాగారం సమీపంలో రమాదేవి ప్రసవించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
వెంకటాపురం(కె): మండల పరిధి బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె ప్రశాంత్(29) శనివారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు బయట నిద్రించేందుకు ఫ్యాన్ వైర్లను స్విచ్ బోర్డులో పెడుతున్న సమయంలో ప్రశాంత్‌కు విద్యుత్ షాక్ తగిలింది. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందిస్తుండగా అతడు మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరించారు.
మూడో రోజు అన్నదానం
భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారి పక్కన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో మూడోరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భక్తులకు భోజనం వడ్డించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భోజనం చేశారు. కార్యక్రమంలో కమలాపూర్ మాజీ సర్పంచ్ తోట సంతోశ్, భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ సిరుప అనిల్, అప్పం కిషన్, తోట రంజిత్, మహేందర్, చరణ్, కోటి, హఫీజ్, సాయితేజ పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో 10వేల మంది తరలింపు
భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో భాగంగా మూడో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి 183 ఆర్టీసీ బస్సుల్లో 10,500 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం నుంచి సాయంత్రం 6గంటలకు 170 బస్సులో 7,500 మంది తిరిగి వెళ్లినట్లు తెలిపారు.
పూనెం ప్రతాప్

జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలి

జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలి

జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలి