
తిరంగా యాత్రను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న సైనికులకు, విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల గౌరవార్థం చేపడుతున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని తిరంగ యాత్ర జిల్లా కన్వీనర్ భూక్య జవహర్‌లాల్ అన్నారు. ఈమేరకు శనివారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్ నుంచి జాతీయ రహదారిపై తిరంగ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ సైనికులకు మద్దతుగా ఆపరేషన్ సిందూర్ వీర విజయాన్ని స్మరించుకుంటూ ర్యాలీ కొనసాగుతుందని, ర్యాలీలో విద్యార్థులు, కుల సంఘాలు, ఉద్యోగులు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరాం, భాస్కర్‌రెడ్డి, ిపింగిళి నాగరాజు, దుభాషి రమేశ్, గోవింద్‌నాయక్, మధు, కుమార్, రాహుల్, రవీంద్రచారి, శ్రీను, రాజన్న, నాగరాజు, కృష్ణాకర్, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.