డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్‌

Yami Gautam Ties The Knot With Uri Director Aditya Dhar - Sakshi

హీరోయిన్‌ యామీ గౌతమ్‌ పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆదిత్యతో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది. కాగా పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, 'ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌' డైరెక్టర్‌.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్‌ హీరోగా 'ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ' సినిమా తీస్తున్నాడు. ఇదిలా వుంటే హీరోయిన్‌ ప్రణీత కూడా ఈ మధ్యే పెళ్లి చేసుకుని అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇక యామీ గౌతమ్‌ విషయానికొస్తే.. 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 'విక్కీ డోనర్‌'తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్‌ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్‌ సరసన 'కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌'లో నటించింది. ప్రస్తుతం ఆమె 'భూత్‌ పోలీస్‌'తో పాటు 'దస్వి', 'ఎ థర్స్‌డే' చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: హీరో ఆశీష్‌ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top