వీకెండ్‌లో సినిమా పండగ.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు! | Movies List To Release On OTT This Weekend Goes Viral | Sakshi
Sakshi News home page

OTT Release movies: ఓటీటీ ప్రియులకు వీకెండ్‌ ట్రీట్.. ఏకంగా 17 చిత్రాలు!

Jan 24 2024 9:10 PM | Updated on Jan 25 2024 9:54 AM

This Weekend OTT Release movies list Goes Viral - Sakshi

కొత్త ఏడాదిలో అప్పుడ మరో నెల ముగుస్తోంది. సంక్రాంతికి టాలీవుడ్‌ సినిమాలు సందడి చేయగా.. ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక సంక్రాంతి చిత్రాల హడావుడి అంతా అయిపోయింది. అయితే జవవరి చివరి వారంలోనూ మరికొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటికే రిలీజైన ధనుశ్ కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగులోనూ రిలీజవుతున్నాయి. అయితే ఈ సినిమాలపై తెలుగు ఆడియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

దీంతో ఈ వారం వీకెండ్‌పై కొత్త సినిమాల ప్రభావం పెద్దగా లేనట్లే. అందుకే సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్రియుల కోసం ఈ వీకెండ్‌లో సందడి చేసే సినిమాల లిస్ట్‌ మీకోసమే. మీ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీలో చూసేయండి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ మీరు లుక్కేయండి. 

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే

నెట్‌ఫ్లిక్స్‌

  •     గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  •     క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  •     సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  •     బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25
  •     మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
  •     బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26
  •     క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28

అమెజాన్ ప్రైమ్

  •     కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 25
  •     హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24
  •     ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26
  •     పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26

హాట్‌స్టార్   

  •     ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  •     ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26
  •     కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26
  •     ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) - జనవరి 27

జీ5

  •     సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26


ఆపిల్ ప్లస్ టీవీ

  •     మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26


 

Advertisement
 
Advertisement
Advertisement