టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం రణబాలి. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఇవాళ రణబాలి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఓవర్సీస్లో షోలు పడిపోయాయి. రణబాలి చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. విజయ్- రష్మిక మధ్య సీన్స్ స్పెషల్గా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. కానీ కథనం చాలా నెమ్మదిగా సాగిందని అంటున్నారు. అంతే కాకుండా వయొలెన్స్ విపరీతంగా ఉందని పోస్టులు పెడుతున్నారు.
బ్రిటిష్ కాలం నాటి సన్నివేశాలు పెద్దగా భావోద్వేగాన్ని కలిగించడంలో అంతగా ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. కొన్ని సీన్స్ చాలా సాధారణంగా చిత్రీకరించారని చెబుతున్నారు. ఈ మూవీలో నేపథ్య సంగీతం చాలా నిరాశపరిచిందని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ranabaali Review # “దత్తత ఇవ్వడానికి ఆ నవాబ్ గాడు ఎవడు… తీసుకోవడానికి ఈ ఇంగ్లీషోడు ఎవడు?” 🔥 “ఎవడ్రా దొర… ఎవడికి రా దొర!” 💥 విజయ్–రష్మిక ట్రాక్, ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్! సీరియస్గా సాగుతూ.. అక్కడక్కడా మంచి హై ఇచ్చిన డీసెంట్ ఫస్ట్ హాఫ్..! 🔥👏 సెకండాఫ్!! 🤞 #Ranabaali #VijayDeverakonda #RashmikaMandanna
— Janya Digital Media (@janyamedia1) October 15, 2026
#Ranabaali Dull 1st Half! VD-Rashmika’s portions stand out and are executed well, but the rest of the narration is dead slow, flat, and overly violent at times. British sequences fail to create much emotional impact and are handled in a generic way. BGM is a huge letdown so far.
— Venky Reviews (@venkyreviews) October 15, 2026


