Thalapathy Vijay Divorce : పెళ్లైన 22ఏళ్ల తర్వాత విడాకులకు సిద్ధమైన విజయ్‌-సంగీత? నిజమేంటి?

Thalapathy Vijay Wife Sangeetha Heading For Divorce Here Is The Truth - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతకాలంగా ఇద్దరికి విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉన్నారంటూ కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. నిజానికి విజయ్‌కు సంగీత వీరాభిమాని. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలా అర్థాంతరంగా విడాకులు తీసుకోవడం ఏంటని విజయ్‌ ఫ్యాన్స్‌ షాకయ్యారు.

ఈ విడాకుల రూమర్స్‌ ఎలా వచ్చాయంటే.. రీసెంట్‌గా వారీసు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంగీత రాకపోవడం, ఆమధ్య డైరెక్టర్‌ అట్లీ భార్య ప్రియ సీమంతం వేడకలోనూ విజయ్‌ ఒక్కడే వెళ్లడంతో వీరిద్దరికి విబేధాలు తలెత్తాయంటూ తమిళవర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇందులో నిజం లేదని విజయ్‌ సన్నిహితవర్గాలు తేల్చేశాయి.

ప్రస్తుతం పిల్లలతో కలిసి సంగీత అమెరికాలో ఉందని, త్వరలోనే ఆమె ఇండియాకు రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను నమ్మకండి అంటూ రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. మరోవైపు వారీసు రిలీజ్‌ నేపథ్యంలో కొందరు కావాలనే ఇలాంటి అవాస్తవాలు పుట్టిస్తున్నారంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top