హ‌నుమాన్ దెబ్బ అదుర్స్‌.. కేజీఎఫ్‌, కాంతార రికార్డులు బ‌ద్ధ‌లు.. | Sakshi
Sakshi News home page

Hanu Man Collections: రోజురోజుకీ పెరుగుతున్న వ‌సూళ్లు.. మూడు రోజుల్లో ఎంతొచ్చిందంటే?

Published Mon, Jan 15 2024 4:35 PM

Teja Sajja Hanuman Movie Three Days Collections - Sakshi

క‌థ‌లో ద‌మ్ముంటే చాలు జ‌నాలు ఇట్టే క‌నెక్ట్ అవుతారు. అది హ‌నుమాన్‌తో నిరూపిత‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు హాలీవుడ్ సూప‌ర్ హీరోల‌నే ఇష్ట‌ప‌డిన జ‌నాలు హ‌నుమాన్ చూసి యూట‌ర్న్ తీసుకుంటున్నారు. హ‌నుమాన్‌ను అంద‌రికంటే బెస్ట్ సూప‌ర్ హీరోగా కొనియాడుతున్నారు. పాజిటివ్ టాక్‌, సెల‌వుల కార‌ణంగా రోజురోజుకీ వ‌సూళ్లు పెంచుకుంటూ పోతోందీ చిత్రం.

పుష్ప‌తో స‌మానంగా..
తాజాగా ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సినీ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. '2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హ‌నుమాన్‌. మొద‌టి మూడు రోజుల ఓపెనింగ్స్‌.. కేజీఎఫ్ ఫ‌స్ట్ పార్ట్‌, కాంతార హిందీ డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్స్‌ వ‌సూళ్ల కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. పుష్ప హిందీ వ‌ర్ష‌న్‌తో స‌మానంగా వ‌సూళ్లు రాబడుతోంది. కేవ‌లం హిందీ వ‌ర్ష‌న్ తొలి రోజు రూ.2.15 కోట్లు రాబ‌ట్ట‌గా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.06 కోట్లు వ‌చ్చాయి. జ‌న‌వ‌రి 25వ‌ర‌కు పెద్ద సినిమాలేమీ లేక‌పోవ‌డంతో హ‌నుమాన్ క‌లెక్ష‌న్స్ మ‌రింత పుంజుకునే ఛాన్స్ ఉంది' అని ఎక్స్‌(ట్విట‌ర్‌)లో రాసుకొచ్చాడు.

హాఫ్ సెంచ‌రీకి చేరువ‌లో
మ‌రోవైపు హ‌నుమాన్‌కు మౌత్ టాక్ ద్వారా ప‌బ్లిసిటీ జ‌రుగుతోంది. ఈ కార‌ణంగా రోజురోజుకీ క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌స్తున్నాయి., ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ క‌లెక్ష‌న్స్ రూ.40 కోట్ల పైనే వ‌సూళ్లు రాబ‌ట్టి ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిత్ర‌యూనిట్ బాక్సాఫీస్ లెక్క‌ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. కాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. హీరో రానా త‌న చెప్పులు ఓ మూల‌న విడిచేసి హ‌నుమాన్ పోస్ట‌ర్‌, గ‌ద ముందు ఫోటోలు దిగాడు. ఇది చూసిన జ‌నాలు రానాను మెచ్చుకుంటున్నారు.

మొద‌టి విరాళం ఎన్ని ల‌క్ష‌లంటే?
ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడిన‌న్ని రోజులు ప్ర‌తి టికెట్‌పై వ‌చ్చే డ‌బ్బులో ఐదు రూపాయ‌లు అయోధ్య‌లోని రామ‌మందిరానికి విరాళంగా ఇస్తామ‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తొలిరోజు క‌లెక్ష‌న్స్ ఆధారంగా రూ.14 ల‌క్ష‌ల‌ను అయోధ్య రామాల‌యానికి విరాళంగా ఇచ్చారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ, నిర్మాత నిరంజ‌న్ రెడ్డి.. కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇచ్చేట్లు క‌నిపిస్తున్నారు.

చ‌ద‌వండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవ‌మానించారు.. భ‌రించ‌లేక వెళ్లిపోదామ‌నుకున్నా!

Advertisement
 
Advertisement
 
Advertisement