టాలీవుడ్ యంగ్ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్! | Hanuman Hero Teja Sajja In IFFI Goa Video Goes Viral | Sakshi
Sakshi News home page

Teja Sajja: హనుమాన్ హీరో కాళ్లకు నమస్కరించిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్!

Nov 24 2024 4:10 PM | Updated on Nov 24 2024 4:31 PM

Hanuman Hero Teja Sajja In IFFI Goa Video Goes Viral

ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా పొంగల్‌ పోటీలో సూపర్ హిట్‌గా నిలిచింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ చిత్రాలతో పోటీపడి రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. 

అయితే ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్‌ఐ వేడుకల్లో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హనుమాన్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా వేదికపై సందడి చేశారు. ఆ సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ సిటిజెన్‌ తేజ సజ్జా కాళ్లకు నమస్కరించాడు. అయితే వెంటనే తేజ ఆయనను ‍అలా చేయవద్దని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా.. తేజ ప్రస్తుతం మరో మూవీలో హీరోగా నటిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement