
నేను ఐశ్వర్య రాయ్ కంటే అందగత్తెను అంటోంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్‌బాస్ బ్యూటీ తాన్య మిట్టల్ (Tanya Mittal). తాన్య ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొంది. ఈ షో కోసం ఏకంగా 800 చీరలు, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ పట్టుకెళ్లింది. పూటకో చీర మారుస్తానని, దానికి మ్యాచింగ్ కోసం కిలోల కొద్ది నగల్ని బిగ్‌బాస్ హౌస్‌కు పట్టుకెళ్లింది. అక్కడకు వెళ్లాక.. తనకు ఫ్రిజ్ డోర్ తీయడం రాదని, తలస్నానం చేయడం రాదంటూ షోలో ఒకటే ఓవరాక్షన్ చేస్తోంది.
అవన్నీ నావల్ల కాదు
ఈ క్రమంలో ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తాన్య.. నాకు చాలా వింత కోరికలున్నాయి. సుష్మితా సేన్ గెలిచిన మిస్ యూనివర్స్ కిరీటాన్ని నాకు బహుకరించినట్లు కలగన్నాను. పైగా నేను ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంటాను.. కానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సాయంత్రం ఆరు దాటిందంటే బయటకు వెళ్లకూడదు, ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడకూడదు, జీవితంలో వంట తప్ప ఏదీ నేర్చుకోకూడదు.. ఇలా నేను బతకలేను. అందంపైనే ఆసక్తి ఏర్పడింది. అందంగా కనిపించాలన్న కోరిక నాలో ఎక్కువవుతూ వచ్చింది అని చెప్పుకొచ్చింది. అలాగే తను 12వ తరగతివరకు మాత్రమే చదివినట్లు తాన్య పేర్కొంది.
చదవండి: నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా!