మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా.. 'రావు బహదూర్‌' టీజర్‌ | Satyadev And Mahesh Babu Movie Rao Bahadur Teaser Out Now | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా.. 'రావు బహదూర్‌' టీజర్‌

Aug 18 2025 12:00 PM | Updated on Aug 18 2025 12:00 PM

Satyadev And Mahesh Babu Movie Rao Bahadur Teaser Out Now

మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్‌ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్‌’ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది. సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్‌ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్‌ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్‌ పాత్ర సరికొత్తగా ఉండనుంది. రావు బహదూర్‌ పాత్ర మేకప్‌ కోసమే అయిదుగంటల సమయం పట్టేదని ఆయన  చెప్పారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement