Gopichand 30th Movie: Gopichand Injured During Shooting - Sakshi
Sakshi News home page

Gopichand : ప్రమాదానికి గురైన హీరో గోపీచంద్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌

Apr 29 2022 8:22 PM | Updated on Apr 29 2022 8:36 PM

Gopichand 30 Movie: Gopichand Injured During Shooting - Sakshi

Gopichand Injured During Shooting: హీరో గోపీచంద్‌ షూటింగ్‌ లొకేషన్‌లో ప్రమాదానికి గురయ్యాడు. 

హీరో గోపీచంద్‌ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్‌ లొకేషన్‌లో ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, గోపీచంద్‌ క్షేమంగా ఉన్నారని సమచారం. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్‌ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  గోపీచంద్‌కి  లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతుంది. అయితే ఓ ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి కాలు జారి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు గాయాలు కాలేదని, ప్రస్తుతం గోపీచంద్‌ క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్‌ శ్రీవాస్‌ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement