ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్‌ చేయించిన చిరు | Chiranjeevi Felicitates Young Cricketer Tilak Varma for His Asia Cup | Sakshi
Sakshi News home page

Chiranjeevi: ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్‌ చేయించిన చిరు

Oct 16 2025 4:07 PM | Updated on Oct 16 2025 4:56 PM

Chiranjeevi Felicitates Young Cricketer Tilak Varma for His Asia Cup

ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్‌గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్‌లో కేక్ కట్‌ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్‌ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నయనతార,  అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.

కాగా..ఇటీవల దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement