Buzz: Bigg Boss Telugu OTT Starting Date Confirmed, Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్‌ ఓటీటీ లాంచ్‌కు ముహూర్తం అప్పుడేనా?

Jan 3 2022 1:34 PM | Updated on Jan 3 2022 2:57 PM

Buzz: Bigg Boss Telugu OTT Starting Date Confirmed, Details Inside - Sakshi

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లు అఖిల్‌ సార్థక్‌, హరితేజ సహా పలువురిని సైతం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది...

Bigg Boss OTT: బిగ్‌బాస్‌ షోకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. కొందరు మొదటినుంచీ ఈ కాన్సెప్ట్‌ నచ్చి ఇంట్రస్టింగ్‌గా చూస్తుంటే మరికొందరు మాత్రం ఇదో దిక్కుమాలిన షో అంటూనే దాన్ని వీక్షిస్తారు. అందుకే అన్ని టీవీ షోలను వెనక్కు నెట్టేసి మరీ మంచి టీఆర్పీ దక్కించుకుంటుంది బిగ్‌బాస్‌. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ వచ్చే నెలలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వరుసగా మూడోసారి నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. కాకపోతే ఈసారి టీవీలో కాకుండా కేవలం ఓటీటీలోనే అందుబాటులోకి రానుంది. ఈ షో కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో కొన్ని మార్పుచేర్పులు చేసి మెరుగులు దిద్దుతున్నారట!

ఓటీటీలో కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం కాకుండా హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందనేది చూపిస్తారట. ప్రస్తుతం బిగ్‌బాస్‌ టీమ్‌ కంటెస్టెంట్ల కోసం జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఐదో సీజన్‌ కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసిన వారిలో కొందరిని ఓటీటీ కోసం అడుగుతున్నట్లు సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ లిస్టులో యాంకర్‌ శివ, వర్షిణి, వైష్ణవి, ఢీ విజేత రాజు ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లు అఖిల్‌ సార్థక్‌, హరితేజ సహా పలువురిని సైతం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ఓటీటీ ఫిబ్రవరి 20న లాంచ్‌ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతరవకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement