
భోజ్పురి నటుడు పవన్ సింగ్ వివాదం మరవకముందే మరో స్టార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే నటి అంజలి రాఘవ్ను ఓ ఈవెంట్లో వేదికపై అసభ్యంగా తాకాడ. దీంతో అతనిపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కాస్తా వివాదానికి దారి తీయడంతో ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అంజలి సైతం భోజ్పురి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.
ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉండగానే మరో భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఓ మహిళా అభిమానితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రవర్తనతో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తన విమర్శలొస్తున్నాయి. అతన్ని చీప్ క్యారెక్టర్ అంటూ పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ భోజ్పురి నటుడిపై మండిపడుతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధితో మరో వివాదం తలెత్తడంతో ఆ సినిమా ఇండస్ట్రీపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి.
What Khesari Lal Yadav did with this girl is more shameless or similar to what Pawan Singh did. These so called Bhojouri superstars are so cheap. #PawanSingh #khesarilalyadav pic.twitter.com/C1ugsrN5mJ
— Avinash Choubey (@avinashchoubey) August 31, 2025