
‘‘తెలుగులో ‘పరదా’ లాంటి కథని నమ్మి, నిర్మించిన విజయ్‌గారికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఇది. కెరీర్‌లో ఉత్తమ నటన ఇచ్చానని రివ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ‘పరదా’ లాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని అనుపమా పరమేశ్వరన్ తెలిపారు.
ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరదా’. భాగ్యలక్ష్మి పోస సమర్పణలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ–‘‘ప్రవీణ్‌గారు చాలా నిజాయతీగా ఈ సినిమా తీశారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా బాగుంది.
ఈ సినిమా కొన్ని సంవత్సరాలు పాటు గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. ‘‘మా చిత్రానికి జాతీయ స్థాయిలో చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో నటనకుగానూ అనుపమకి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అని తెలిపారు. ‘‘పరదా’ చాలా మంది అమ్మాయిల జీవితాన్ని గుర్తు చేసిందని ఒక పెద్దావిడ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చేసినందుకు ఒక నిర్మాతగా చాలా గర్వపడుతున్నాను’’ అన్నారు విజయ్ డొంకాడ.