Anupama Parameswaran Butterfly Movie Direct Releasing On Disney Plus Hot Star, Deets Inside - Sakshi
Sakshi News home page

Butterfly In OTT: నేరుగా ఓటీటీకి ‘బటర్‌ఫ్లై’ మూవీ.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే..!

Dec 12 2022 2:51 PM | Updated on Dec 12 2022 3:29 PM

Anupama latest Movie Butterfly Released On Disney plus hot star - Sakshi

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బటర్‌ఫ్లై'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 

ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు  తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. గంటా సతీశ్‌ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రసాద్‌ తిరువళ్లూరి, ప్రదీప్‌ నల్లిమెల్లి నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్‌తో కలిసి నటించిన చిత్రం ‘18 పేజీస్‌’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement