Akhanda Movie Review And Rating In Telugu | Balakrishna Akhanda Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Akhanda Twitter Review: అఘోరాగా బాలయ్య అదరగొట్టేశాడా?

Dec 2 2021 7:47 AM | Updated on Dec 2 2021 2:32 PM

Akhanda Movie Twitter Review In Telugu - Sakshi

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` నేడు(డిసెంబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  సింహా’, ‘లెజెండ్‌’ వంటి బిగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడం, తానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. బాలయ్య మాస్‌ డైలాగ్స్‌ ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.
(చదవండి: ‘అఖండ’మూవీ రివ్యూ)


ఫస్టాఫ్‌ చాలా బాగుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. సెకండాఫ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తమన్‌ నేపథ్య సంగీతం అదిరిపోయిందట. బాలయ్య చెప్పే మాస్‌ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్‌ ఈళలు వేయడం పక్కా అని ఓ నెటిజన్‌ కామెంట్‌చేశాడు. ఇక ఎప్పటి లాగే బాలయ్య తనదైన నటనతో రెచ్చిపోయాడట. అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్‌ అట. ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement