Aadi Sai Kumar: హీరో ఆది కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టాప్ గేర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ధనలక్ష్మీ ప్రొడక్షన్స్‌పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికాంత్ దర్శకుడు.
‘‘ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకుని వైవిధ్యమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం’’ అన్నారు ఆది సాయికుమార్. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.
Here's the Intriguing Title revealing Poster of #AadiSaiKumar next, All filled with Red, Rage & Rush "#TOPGEAR" 💥🔥#AdityaMovies & Entertainments Presents #SriDhanaLakshmiProductions @IRiyaSuman @actorbrahmaji #SatyamRajesh #Shashikanth #SridharReddyKV @adityamovies pic.twitter.com/b5unTqA620
— Aditya Music (@adityamusic) June 11, 2022