క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు తీసుకోవాలి
అబ్జర్వర్ భారతి నాయక్
చేగుంట(తూప్రాన్): అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల అబ్జర్వర్ భారతి నాయక్ పేర్కొన్నారు. మంగళవారం చేగుంటలోని నామినేషన్ కౌంటర్లను ఆమె సందర్శించారు. నామినేషన్లు తీసుకుంటున్న తీరును ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నామినేషన్ పత్రాన్ని ముందుగానే సరి చూసుకోవాలని, తప్పులు లేకుండా అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాత నామినేషన్ స్వీకరించాలని పేర్కొన్నారు. అభ్యర్థుల నామినేషన్ల నమోదు నంబర్లు సైతం రికార్డుల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నామినేషన్ పత్రాలను తీసుకోవాలని సూచనలు చేశారు. ఆమె వెంట తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్‌గౌడ్, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.
క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు తీసుకోవాలి


