
ప్రయాణికులకు బస్సులు కరువు
చేగుంట(తూప్రాన్): ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపూర్ శివారులో ఆర్టీసీ బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేగుంట– దుబ్బాక రూట్‌లో ఒకే బస్సు నడుస్తుందని పలువురు వివరించారు. అనంతరం బస్సు డ్రైవర్ కండక్టర్‌తో మాట్లాడి బస్సులపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా బస్సులను నడిపించడం లేదని ఆరోపించారు. ఉన్న బస్సుల్లో సౌకర్యాలు లేవని తెలిపారు. అధికారులు వెంటనే చేగుంట– దుబ్బాక రూట్‌లో ప్రయాణికులకు సరిపడా బస్సులు నడిపించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి