
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్
ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్
కౌడిపల్లి(నర్సాపూర్): రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పీర్లతండాలో మంచినీటి సరఫరా, ఇంటింటికి నల్లా కనెక్షన్‌లపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో ప్రతి ఇంటికి నల్లాకనెక్షన్ ఉంది.. లేనిది సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. కొత్తగా నిర్మించిన ఇళ్లతో పాటు నల్లా కనెక్షన్‌లు లేని ఇళ్లను గుర్తించి అవసరమైన కనెక్షన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు కాగానే నల్లాలేని ఇంటికి నల్లాకనెక్షన్ ఇస్తామని తెలిపారు.