
బెల్లం, పటిక స్వాధీనం
కాగజ్‌నగర్‌టౌన్/చింతలమానెపల్లి: కాగజ్‌నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పరిధిలోని చింతలమానెపల్లి మండలంలో గురువారం నాటుసారాకు ఉపయోగించే బెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ రవికుమార్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రఘురామ్, జిల్లా అధికారి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి 10 లీటర్ల నాటుసారా, 1800 కిలోల పటిక, క్వింటాలు బెల్లం, నాటుసారా తయారీ పదార్థాలను సరఫరా చేసే స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి రణవెల్లి గ్రామానికి చెందిన జటోత్ నారిబాయి, లంబడిహెట్టకి చెందిన అజ్మెర శ్యామ్‌లాల్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన ముడి సరుకు విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. దాడుల్లో ఎస్సైలు లోబానంద్, సురేష్, సిబ్బంది మల్లేశ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.