
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి
పాతమంచిర్యాల: ముదిరాజ్‌లు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్పు చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు. మత్స్య సంపదపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వ రుణాలు, వస్తు సామగ్రి అందడం లేదన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, రాష్ట్ర కార్యదర్శులు టి.శ్రీకాంత్, కంకణాల సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనబోయిన కృష్ణ, పట్టణ అధ్యక్షుడు భూతపల్లి రాజేశం, యూత్ అధ్యక్షుడు గరికె సుమన్ పాల్గొన్నారు.