
రూ.21.50 లక్షల విలువైన మద్యం ధ్వంసం
● ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో
పట్టుకున్న అధికారులు
చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పట్టుకున్న రూ.21.50 లక్షల విలువైన మద్యాన్ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ అధికారి జ్యోతి కిరణ్ పర్యవేక్షణలో బుధవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25న చింతలమానెపల్లి మండలంలోని గూడెంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే స మాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక వైన్స్ నుంచి తరలించి అక్రమంగా ఓ బెల్టుషాపులో నిల్వ ఉంచిన రూ.21.50 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేష న్‌కు తరలించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 10,155 బీరు బాటిళ్లు, మరో 300 విస్కీ సీసాలను బుధవారం పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై వరుసగా పే ర్చి రోలర్‌తో ధ్వంసం చేశారు. పగిలిన సీసాల నుంచి మద్యం వరదలా ప్రవహించింది. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ము త్యం రమేశ్, ఎకై ్సజ్ సీఐ రవికుమార్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.