
గ్లోబల్ లెర్నింగ్‌లో ఆర్జీయూకేటీ ముందడుగు
బాసర: బాసర ఆర్జీయూకేటీ గ్లోబల్ లెర్నింగ్లో మరో ముందడుగు వేసిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం ఓఎస్‌డీ మురళీదర్శన్‌తో కలిసి గ్లోబల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–2026 విద్యాసంవత్సరానికి అమెరికాలోని ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ద్వారా ఆఫర్ చేస్తున్న రెండు అంతర్జాతీయ ప్రోగ్రామ్‌లకు సంబంధించి రూ.40 లక్షల విలువైన 453 ఉచిత కోర్సెరా లైసెన్స్‌లు విద్యార్థులకు అందించామన్నారు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు లీడర్‌షిప్, ఇన్నోవేషన్, మషీన్ లెర్నింగ్ వంటి అత్యవసర నైపుణ్యాలలో అంతర్జాతీయ సర్టిఫికేషన్‌తో కూడిన అనుభవాన్ని పొందనున్నారన్నారు. ఈ ప్రోగ్రామ్‌లు నేటి నుంచి ఈనెల 14 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సుజయ్ సర్కార్, కోర్సు ఇన్‌స్ట్రక్టర్లు స్వాతి, స్వప్నిల్, ఐఐఈడీ కోఆర్డినేటర్ రాకేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.