
మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
బెల్లంపల్లిరూరల్: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించిన ఘటన బెల్లంపల్లి మండలంలో చోటు చేసుకుంది. తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల మేరకు రవీందర్‌నగర్‌కు చెందిన గాదం శ్వేత సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న రెండు తులాల గొలుసు అపహరించాడు. బాధిత మహిళ కేకలు వేయడంతో దొంగ పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మంగళవారం డాగ్‌స్కాడ్‌తో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.