
‘లేబర్‌కోడ్‌ల రద్దుకు ఉద్యమించాలి’
పాతమంచిర్యాల: కార్మికచట్టాల సవరణ పేరుతో తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌ల రద్దుకు ఉద్యమించాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్‌లో ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీయూసీఐ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏడు రోజుల పనివిధానం నాలుగు రోజులకు కుదించడం వలన కార్మికులు ఉపాధి కోల్పేయే ప్రమాదముందన్నారు. లేబ్‌కోడ్‌ల అమలును కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, చట్టాల రక్షణకోసం ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఎండీ చాంద్‌పాషా, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్, నాయకులు మిట్టపల్లి పౌలు, తాళ్లపల్లి శ్రీనివాస్, బ్రహ్మానందం, అరుణ, సురేందర్, చిన్నయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.