
దోమలను నివారించాలి
మంచిర్యాలటౌన్: దోమలను నివారించాలని జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ అనిత సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ద్వారా మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు. అనంతరం దోమ తెరల వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులుండే అన్ని గదుల్లో దోమల నివారణకు మందు పిచికారి చేయించారు. డాక్టర్ శివప్రతాప్, శ్రీనివాస్, సీహెచ్‌వో దీక్షితరాణి, కళాశాల ప్రిన్సిపాల్ అనూష, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, ఏఎన్‌ఎం అంజలి, ఎంటీఎస్ సంతోష్ పాల్గొన్నారు.