
మల్లన్న కల్యాణం
జైపూర్: ఏటా తొలి ఏకాదశికి ముందు వేలాల మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఖేతమ్మ భ్రమరాంభిక శ్రీమల్లన్న స్వామికి పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం చేయించారు. సోమవారం ఉదయం ఒగ్గు పూజారుల నేతృత్వంలో పెద్దపట్నం వేసి ఖేతమ్మ భ్రమరాంభికాసమేత శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. సాయంత్రం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించగా, సమీప ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణం వీక్షించి తరించారు. స్వామివారిని దర్శించుకుని పూజలుచేశారు. అగ్నిగుండాల్లో నిప్పులపై నడిచారు. మొక్కులు చెల్లించుకున్నారు. వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మల్లన్నను ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమేశ్, ఎస్సై శ్రీధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మల్లన్న కల్యాణం

మల్లన్న కల్యాణం