
ఇళ్ల పట్టాల కోసం ధర్నా
శ్రీరాంపూర్: సింగరేణి స్థలాల్లో శాశ్వతంగా నివా సం ఉంటున్నవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదు ట సోమవారం ధర్నా చేశారు. ఏరియా ఎస్‌ఓటూ జీఎం సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ అందరికీ పట్టాలిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి, కొద్ది మందికే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. కాంగ్రెస్ కూడా పట్టాలిస్తామని విస్మరించిందని పేర్కొన్నారు. ధర్నాలో జిల్లా నాయకులు గాజుల ముఖేశ్‌గౌడ్, ఎనగందుల కృష్ణమూర్తి, తిరుపతి, పి.కమలాకర్‌రావు, పట్టణ అధ్యక్షుడు సత్రం రమేశ్, నాయలు పాల్గొన్నారు.