
ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలని, పరిష్కారానికి కలెక్టరేట్‌కు వచ్చే వరకూ చూడొద్దని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే అర్జీలు పరిష్కరించడంలోనూ జాప్యం చేయవద్దని సూచించారు. కలెక్టేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్, హరికృష్ణతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.
ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చే వరకూ చూడొద్దు
అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు
కలెక్టర్ కుమార్ దీపక్