
ఆలస్యంగా వచ్చారని..
కోటపల్లి: పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వానలో నిలబెట్టారు కోటపల్లి గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. పాఠశాలలో 6, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు పాఠశాల పునఃప్రారంభం తర్వాత సోమవారం పాఠశాలకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఆలస్యంగా వచ్చారని ఆగ్రహించిన ప్రిన్సిపాల్ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను లోని కి రానివ్వలేదు. ఒవైపు వర్షం కురుస్తున్నా.. గేటు తీయలేదు. దీంతో రెండు గంటలపాటు వానలోనే నిరీక్షించారు. చివరకు తల్లిదండ్రులు ఇంకోసారి జరగదని లిఖితపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. అయినా ప్రిన్సిపాల్ అంగీకరించలేదు. ఉన్నతాధికారుల అనుమతి తీ సుకుని రావాలని ఆదేశించారు. దీంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బీఆర్‌ఎస్ నాయకుల జోక్యంతో పిల్లలను అనుమతించారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం ఆశోక్‌ను వివరణ కోరగా, విద్యార్థులను ఇ బ్బంది పెట్టాలనే ఉద్దేశం లేది, విద్యార్థులకు, తల్లిదండ్రులకు చదువు, క్రమశిక్షణ విలువ తెలియాలని అనుమతించలేదని తెలిపారు.