
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సర్వం సిద్ధం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి ని స్టేడియంలో నేటి నుంచి ఈనెల 11 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీలకు సర్వం సిద్ధమయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల నుండి హాకీ టీంలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఐదు జిల్లాల క్రీడాకారులు చేరుకున్నారు. స్టేడియంలోని మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ ఫీల్డ్‌లో ఏర్పాట్లను ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్థసారథి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోటీల ప్రా రంభోత్సవానికి ఎంపీ గోడం నగేశ్, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరుకానునట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా క్రీడాకారులకు జెర్సీలను అందించారు. పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు.

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సర్వం సిద్ధం