
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
దండేపల్లి: వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని గూడెం, రంగంపల్లెలో కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా రైతులు, నిర్వాహకులతో మాట్లాడారు. సమస్యలపై ఆరా తీశారు. అక్కడి నుంచి కన్నెపల్లి సమీపంలోని శ్రీవెంకటేశ్వర రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. ధాన్యం బస్తాల అన్‌లోడింగ్‌లో ఆలస్యం చేయవద్దని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ బొద్దుల భూమన్న ఉన్నారు.
ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలి..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగా పూర్, నంనూర్, గుడిపేటల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్ట ర్ సబావత్ మోతీలాల్ తనిఖీ చేశారు. కేంద్రాల్లో వసతులపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం తెచ్చి ఎన్నిరోజులవుతుందని అడిగారు. నిబంధనల మేరకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే తరలించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు.