
భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి
మందమర్రిరూరల్: భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల్లో విద్యుత్ భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలని సింగరేణి డీడీఎంఎస్(ఎలక్ట్రికల్) రాజీవ్ ఓం ప్రకాశ్‌వర్మ అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని కేకేఓసీ, కేకే 5 గనుల్లో నాలుగు రోజులపాటు సాధారణ తనిఖీలు నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ హాలులో ఎలక్ట్రికల్ సేఫ్టీ, సాంకేతిక ఇంటరాక్టివ్ సెషన్‌లో విద్యుత్ అపాయాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ రఘుకుమార్, ఎస్‌వోటు జీఎం విజయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, ఏఎస్‌వో రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, కేకే ఓసీపీవో మల్లయ్య, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.