
ఎస్టీపీపీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
జైపూర్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులు, సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్లాంటు జీఎం శ్రీనివాసులు తెలిపారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు అడ్మిన్ భవన కార్యాలయంలో శుక్రవారం సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కా ర్డు వెంట ఉంచుకోవాలని, అత్యవసరమైతే త ప్పించి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు. పరిసరాలు, ప్లాంటు ఆవరణలో అ నుమానితులు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సి బ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వస్తువులు, పార్సిళ్లు వస్తే తీసుకోరాదని కోరారు. సీఐ ఎస్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫోన్‌నంబర్ 83329 74224కు స మాచారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్టీపీపీ వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏజీఎంలు మదన్‌మోహన్, సీఐఎస్‌ఎఫ్ క మాండెంట్ చంచల్ సర్కార్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్‌కపూర్, డీజీఎంలు రమేశ్‌చంద్ర, అజాజుల్లాఖాన్, డీజీఎం పర్సనల్ అజ్మీరాతుకారాం, ఎస్‌అండ్‌పీసీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.