
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ పెద్దవాగు వద్ద బుధవారం 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుబ్బారావు, పాలమరి సురేష్, రాచకొండ నగేశ్, ఇనుముల రవి రెండు కార్లలో తరలిస్తూ పట్టుబడ్డారు. విత్తనాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కార్లను సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో వెంకటేశ్, మధు, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
కత్తులతో పోస్టు పెట్టిన ముగ్గురి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: సోషల్ మీడియాలో కత్తులతో పోస్టు పెట్టిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని తాటిగూడకు చెందిన రాహు ల్ జందాడే, క్రాంతినగర్‌కు చెందిన సయ్యద్ రిజ్వాన్, మహాలక్ష్మివాడకు చెందిన తైవర్‌ఖాన్ కత్తులు పట్టుకుని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్ట డంతో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ సబ్ డివి జన్ పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, యువత కత్తులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, రోడ్ల పై పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించినా, కత్తుల ప్రదర్శన చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.