చెన్నూర్: సెరీ కల్చర్ రైతులు దసలి పట్టు కాయలు పండించడంతోపాటు పట్టు వస్త్రాల ఉత్పత్తిపై దృష్టిసారించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. స్థానిక సెరికల్చర్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన దసలి పట్టు కృషి మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.40 లక్షలతో నిర్మించి న సెరికల్చర్ భవనాన్ని ప్రారంభించారు. అనంత రం కృషి మేళాను ప్రారంభించారు. దసలి కాయలు పండించే రైతులు ధర కోసం బాధపడడం మానుకు ని దారం తీసి బట్టలు తయా రు చేస్తే ఆదాయంతో పాటు, ఉపాధి పెరుగుతుందన్నారు. చెన్నూర్ సెరి కల్చర్ పరధిలో రాష్ట్రంలోనే నాణ్యమైన దసలి కాయతోపాటు ఉత్పత్తి సైతం బాగుందన్నారు. అటవీ ప్రాంతంలో మద్ది చెట్ల పెంపకాన్ని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని రైతులు కలెక్టర్ దృషికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మద్ది చెట్ల పెంపకంతోపాటు రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దారం తీసి వస్త్రాలు తయారు చేసేలా శిక్షణ ఏర్పా టు చేయిస్తానని తెలిపారు. ప్రతిపాదనలు పంపించాలని సమర్థ్ పథకం ద్వారా నిధులు మంజూరవుతాయన్నారు. అనంతరం డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ బోర్డు రాంచికి చెందిన డాక్టర్ ఎన్.బాలజీచౌదరి మాట్లాడుతూ దసలి గుడ్లు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కాయ దిగుబడి పెంచాలన్నా రు. అనంతరం చెన్నూర్ సెరికల్చర్ పరిధిలోని ము ల్కలపేట, ఎదుల్లబంధం గ్రామాలకు చెందిన నలుగురు రైతులకు ప్రశంసాపత్రాలు మెమొంటోలను అందజేశారు. మేళాలో ప్రదర్శించిన దసలి పట్టు చీరలు, శాలువాలు, బునియాది మిషన్, స్పాన్ సిల్క్ మిషన్ దకట్టుకున్నాయి. డాక్టర్ సెల్వకుమార్, సెరికల్చర్ హైదరాబాద్ జేడీ లత, అసిస్టెంట్ సెక్రెటరీ డాక్టర్ మధుకుమార్, ఏడీ రాధోడ్ పార్వతి, డీహెచ్‌ఎస్‌వో కె.అనిత పాల్గొన్నారు.
● కలెక్టర్ కుమార్ దీపక్