ఇచ్చోడ: వరంగల్‌లో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవ సభకు ముఖరా కే గ్రామస్తులు సోమవారం రూ.1,02,003 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గేమీనాక్షి మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేశారని తెలిపారు. అందుకని 25ఏళ్ల పార్టీ ఆవిర్భవ సభకు గ్రామస్తులంతా కలిసి ఖర్చుల కోసం విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విరాళం చెక్కును అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గేసుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.