దండేపల్లి: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లి మండలం ధర్మరావుపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు, దండేపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిర మ్మ మోడల్‌హౌజ్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తుందన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సతీశ్, నాయకులు రాంచందర్, దుర్గప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.