రవాణా శాఖ అధికారుల బదిలీలు | - | Sakshi
Sakshi News home page

రవాణా శాఖ అధికారుల బదిలీలు

Feb 18 2024 12:18 AM | Updated on Feb 18 2024 12:18 AM

రాహుల్‌కుమార్‌, ఎంవీఐ - Sakshi

రాహుల్‌కుమార్‌, ఎంవీఐ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఎట్టకేలకు సామూహిక బది లీలు జరిగాయి. జిల్లా రవాణా శాఖా అధికారి(డీటీఓ)తోపాటు ముగ్గురు మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఏఎంవీఐ) బదిలీ అయ్యారు. జిల్లా రవాణా శాఖాలో దాదాపు ఎనిమిదేళ్లుగా బదిలీలు లేక రవాణా శాఖ చరిత్రలోనే డీటీఓ కిష్టయ్య, ఎంవీఐ వివేకానంద్‌రెడ్డి సీనియర్లుగా నిలిచారు. గత నెల రోజులుగా బదిలీలు జరుగుతాయని ఊహాగానాలు వెలువడుతుండగా రవాణా శాఖ కమిషనర్‌ శనివా రం బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కా ర్యాలయంలోని అధికారులందరినీ మూకుమ్మడిగా బదిలీ చేశారు. డీటీఓ లెక్కల కిష్టయ్య మలక్‌పేట ఆర్టీఓ కార్యాలయాలనికి బదిలీ అయ్యారు. డీటీఓగా 2016 డిసెంబర్‌ 16న బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇక్కడ దాదాపు ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నారు. సీనియర్‌ ఎంవీఐ గుర్రం వివేకానంద్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు బదిలీ అయ్యారు. 2016 డిసెంబర్‌ 24న ఎంవీఐగా రాగా ఆయన కూడా దాదాపు ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నారు. మరో ఇద్దరు ఎంవీఐలు ఎనగందుల రాహుల్‌కుమార్‌, జాదవ్‌ యోగేశ్వర్‌ కూడా బదిలీ అయ్యారు. వీరిద్దరూ 2020 డిసెంబర్‌ 8న పదోన్నతిపై

మంచిర్యాలకు బదిలీపైగా రాగా ప్రస్తుతం ఎంవీఐ రాహుల్‌కుమార్‌ నిజామాబాద్‌ డీటీఓ కార్యాలయానికి, యోగేశ్వర్‌ సత్తుపల్లి ఆర్టీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

ఏఎంవీఐలు సైతం..

డీటీఓ కార్యాలయంలోని నలుగురు ఏఎంవీఐలూ బదిలీ అయ్యారు. ఏఎంవీఐ కొమ్ము శ్రీనివాస్‌ కామారెడ్డి చెక్‌పోస్ట్‌కు, నల్ల ప్రత్యూషారెడ్డి ఆదిలాబాద్‌ డీటీసీ పరిధిలోని భోరజ్‌ చెక్‌పోస్ట్‌కు, శ్రీకాంత్‌ నిజామాబాద్‌ జిల్లా సాలూర చెక్‌పోస్ట్‌కు బదిలీ అయ్యారు.

ఇంకా ఖరారు కాని డీటీఓ?

మంచిర్యాల డీటీఓ నియామకంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక బదిలీ అయిన ఎంవీఐల స్థా నంలో నూతన ఎంవీఐలు నియామకం అయ్యారు. ఎంవీఐలుగా ఆసిఫాబాద్‌ డీటీఓ కార్యాలయం నుంచి టి.సంతోశ్‌కుమార్‌, రాజన్నసిరిసిల్ల జిల్లా డీటీఓ కార్యాలయం నుంచి కిషోర్‌చంద్రరెడ్డి, కోరుట్ల ఆర్టీ ఓ కార్యాలయం నుంచి రంజిత్‌రెడ్డి రానున్నారు. బ దిలీ అయిన ముగ్గురు ఏఎంవీఐల స్థానంలో ఒకరి ని మాత్రమే నియమించారు. జగిత్యాల డీటీఓ కా ర్యాలయం నుంచి ఖాసిమ్‌ మంచిర్యాల డీటీఓ కా ర్యాలయానికి ఏఎంవీఐగా బదిలీపై వస్తున్నారు. డీ టీఓగా ఇంకా ఎవరికీ కూడా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడలేదు. ఆసిఫాబా ద్‌ జిల్లా డీటీఓ రాంచందర్‌కు మంచిర్యాల డీటీఓ ఇంచార్జీగా నియమించనున్నట్లు తెలుస్తోంది.

డీటీఓ సహా ముగ్గురు ఎంవీఐలు, ముగ్గురు ఏఎంవీఐలు

జిల్లాకు ఖరారు కానీ డీటీఓ పోస్టు

యోగేశ్వర్‌, ఎంవీఐ1
1/3

యోగేశ్వర్‌, ఎంవీఐ

లెక్కల కిష్టయ్య, డీటీఓ2
2/3

లెక్కల కిష్టయ్య, డీటీఓ

వివేకానంద్‌రెడ్డి, ఎంవీఐ3
3/3

వివేకానంద్‌రెడ్డి, ఎంవీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement