
పోటీలో తలపడుతున్న మల్లయోధులు
లోకేశ్వరం(ముధోల్): శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బిలోలిలో కుస్తీ పోటీలు నిర్వహించారు. తానూర్, ముధోల్, లోకేశ్వరం మండలాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఆర్థపూర్ తాలూకాలోని బిలు గ్రామానికి చెందిన సాయి ప్రథమ బహుమతి కింద 5 తులాల వెండి, రూ.1,100 నగదు బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సబిత, మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, నాయకులు నర్సింగ్‌రావు, ప్రభాకర్, భోజన్న, ముత్యం, భూమారావు, ప్రకాశ్, సాయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.