వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే!

ఏఎంసీ మైదానంలో పార్టీ శ్రేణులు, స్థానికులతో మాట్లాడుతున్న సీఎల్పీనేత భట్టివిక్రమార్క  - Sakshi

బెల్లంపల్లి: హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరుకుంది. రాత్రి స్థానిక ఏఎంసీ క్రీడా మైదానంలో భట్టి బస చేశారు. గురువారం పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఉదయం వాకర్స్‌, క్రీడాకారులతో కలిసి మార్నింగ్‌ వాక్‌ చేశా రు. తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులు, స్థానికులతో మాట్లాడారు. సింగరేణి పరిస్థితులు అడిగి తెలుసుకున్నా రు. కొత్త నియామకాలు, కారుణ్య నియామ కాల గురించి ఆరా తీశారు. కారుణ్య ఉద్యోగాల కోసం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ముడుపులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త నియామకాలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని తెలిపారు.

పట్టాల పంపిణీలో జాప్యం..

ప్రభుత్వ, సింగరేణి లీజు భూములను ఆక్రమించుకుని స్థిర నివాసాలు కట్టుకున్నవారికి ఇళ్ల పట్టాలు జారీ చేయడంలోనూ జాప్యం జరుగుతోందని తెలి పారు. జీవో 59 ప్రకారంగా పట్టాలు ఇవ్వకుండా జీవో 76తో పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చాక పరిష్కారం..

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తె లంగాణలో అవినీతి సర్కార్‌ను సాగనంపాలన్నా రు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంద ని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి న తర్వాత సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరిస్తామ ని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యుడు చి లుముల శంకర్‌ , కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకు డు మల్లారపు చిన్నరాజం, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కటకం సతీశ్‌కుమార్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అ ధ్యక్షుడు ఆదర్శ్‌వర్ధన్‌రాజు, నాయకులు రొడ్డ శ్యా మ్‌, సిలివేరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

నేడు పాదయాత్ర..

పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర శుక్రవారం తిరిగి ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు ఏఎంసీ మైదానం నుంచి భట్టి యాత్ర ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు. పోశమ్మగడ్డ మీదుగా లంబాడి తండా, తాళ్ల గురిజాల, బట్వాన్‌పల్లిలో ప్రజలను కలుస్తారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం ఉంటుందని, ఆ తర్వాత యాత్ర ప్రారంభించి పెర్కపల్లి, నెన్నెల మండలం గుండ్ల సోమారం మీదుగా సాయంత్రం 7 గంటలకు నార్వాయిపేటకు చేరుకుంటారని వివరించారు. గ్రామంలో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు.

అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించుకుందాం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top