
పూజలు చేస్తున్న భట్టి విక్రమార్క
బెల్లంపల్లి: బెల్లంపల్లి శ్రీకోదండ రామాలయంలో గురువారం శ్రీసీతారాముల వివాహ మహోత్సవ వేడుకల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి బెల్లంపల్లిలో బస చేసిన భట్టి విక్రమార్క శ్రీరామనవమిని పురస్కరించుకుని పాదయాత్రకు ఒకరోజు విరామం ప్రకటించారు. ఈ మేరకు కోదండ రామాలయానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావుతో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ధర్మకర్తలు భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాభిష్టాన్ని పాటించక పోవడం దురదృష్టకరమన్నారు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.