
శ్రీరాముడి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం
మంచిర్యాలలో గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనారాయణ మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో సాగింది. మార్వాడీ ప్రగతి సమా జ్, మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రావు, మార్వాడీ ప్రగతి సమాజ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజ్‌మోహన్‌రేణ్వా, యువమంచ్ అధ్యక్షుడు గోపాల్‌జోషి హాజరయ్యారు. – మంచిర్యాలఅర్బన్

శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు

దండేపల్లి: ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ..