శ్రీరాంపూర్: గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టులను భర్తి చేశారు. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు ఆయా కమిటీల్లో తీసుకున్న వారి వివరాలను వెల్లడించారు. వీరిలో టీబీబీజీకేఎస్ శ్రీరాంపూర్ బ్రాంచీ సెక్రెటరీలుగా కానుగంటి చంద్రయ్య, గడ్డం మహిపాల్‌రెడ్డి, బ్రాంచీ అసిస్టెంట్ సెక్రెటరీలుగా అల్లా వెంకట్‌రెడ్డి, కె.బ్రహ్మచారీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రౌతు సత్యనారాయణ, తోట శ్రీనివాస్, ఐకే ఓసీపీ ఫిట్ సెక్రటరీగా కె.రత్నాకర్‌రెడ్డి, ఆర్కే న్యూటెక్ ఫిట్ సెక్రటరీగా కందుల శంకరయ్య, ఎస్సార్పీ 1 అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా ఏ.తిరుపతిరావు, ఆర్కే న్యూటెక్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా ఎండీ లాలా, ఆర్కే 5 అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా బత్తుల గోపి, ఎస్సార్పీ ఓసీపీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా ఎండీ అమ్జత్, ఐకే 1ఏ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా డీ సతీశ్, ఐకే ఓసీపీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా గోగర్ల గోపాల్‌లను నియమించారు. ఈ సందర్భంగా బ్రాంచీ ఉపాధ్యక్షుడు కె. సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, ఇతర బ్రాంచీ నేతలు జీఎంను కలిసి నూతనంగా కమిటీలో తీసుకున్న వారిని గుర్తించాలని కోరారు.
పది విద్యార్థులకు హాల్ టికెట్‌పై భరోసా
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల యాజమాన్యం హాల్‌టికెట్ ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంచిర్యాల డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ ద్వారా పరీక్షకు అనుమతిస్తారన్నారు. ఈనెల 3నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. కాంపోజిట్ తెలుగు పరీక్ష రాసే విద్యార్థులకు అదనంగా 20 నిమిషాలు కేటాయించనున్నట్లు తెలిపారు. సామాన్య శాస్త్రం పరీక్ష విషయంలో అదనంగా 20 నిమిసాలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి విషయంలో ఏవైనా సందేహలుంటే నివృత్తి చేసుకునేందుకు సహాయ కేంద్రం (కంట్రోల్‌రూం)లో 08736–252420, జిల్లా పరీక్షల సహాయ అధికారి 7032463114లో సంప్రదించవచ్చన్నారు.
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
మంచిర్యాఅర్బన్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వ్యాలూవేషన్ కేంద్రంలో ఈనెల 31 నుంచి ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రారంభం కానుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ స్పాట్ వ్యాలూవేషన్ జరుగనుంది. జిల్లాలోని అన్ని కళాశాల ప్రిన్సిపాళ్లు స్పాట్ వ్యాలూవేషన్ డ్యూటీ టీచర్లను ఖచ్చితంగా రిలీవ్ చేయాలని డీఐఈవో శైలజ తెలిపారు.